ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్‌కు షాక్.. సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో కేసీఆర్ సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. దీంతో ఈ కేసు కేసీఆర్ సర్కార్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

ఎమ్మెల్యేల కొనుగలు కేసును సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. అందుకు కూడా సుప్రీం ససేమిరా అని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కానీ అందుకు సుప్రీంకోర్టు నో చెప్పేసింది.

అలాగే ఈ కేసును వెంటనే విచారించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. కానీ ఈ కేసును ఇప్పటికిప్పుడు విచారించేందుకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. ఈ నెల 17న విచారిస్తామని, అప్పుడే అన్ని అంశాలపై విచారణ ఉంటుందని తెలిపింది. అయితే సీబీఐ చేతికి వెళితే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశముందని, వెంటనే విచారణ చేపట్టాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరినప్పటికీ సుప్రీంకోర్టు ఒప్పుకోకపోవడం విశేషం. ఏ విచారణ అయినా ఈ నెల 17నే చేస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలినట్టయింది.

అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సిట్ విచారణ సరిగా జరగలేదని, సాక్ష్యాధారాలు, విచారణ అంశాలు బయటకు లీక్ అయ్యాయని మండిపడింది. మీడియాకు కూడా లీక్ అయ్యాయని, సిట్ పూర్తిగా ఫెయిల్ అయిందని హై కోర్టు అభిప్రాయపడింది. దీంతో సీబీఐకి ఈ కేసును అప్పగించాలని ఆదేశించింది.

You cannot copy content of this page