రూ. 7 వేల కోట్ల వ్యాపారమే లక్ష్యం
ఛైర్మన్ కొండూరి రవిందర్ రావు
దిశ దశ, కరీంనగర్:
కెడీసీసీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో 91.40 కోటల నికర లాభం గడించిందని ఛైర్మన్ కొండూరి రవిందర్ రావు అన్నారు. వచ్చే ఏడాది రూ. 7 వేల కోట్ల మేర వ్యాపారం చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో రూ. 40 వేల కోట్ల వ్యాపారం గత సంవత్సరం చేయగా ఇందులో కరీంనగర్ బ్యాంకు ద్వారా రూ. 5,655 కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 68.08 కోట్ల లాభాన్ని అర్జిస్తే ఈ ఏడాది రూ. 91.40 కోట్లు లాభాలకు చేరుకోవడం సంతోషకరంగా ఉందని రవిందర్ రావు అన్నారు.
రు. బ్యాంక్ తన స్థూల నిరర్థక ఆస్తులను 2021-22 సంవత్సరంలో 1.50 శాతం నుండి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1 శాతానికి తగ్గించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 14.79 శాతం వృద్ధి రేటుతో రూ. 5,625 కోట్ల మొత్తం వ్యాపారం చేసిందని, కొన్ని డిపాజిట్లను కోల్పోయినప్పటికీ బ్యాంక్ స్థిరమైన వృద్ధిని సాధించడంలో సక్సెస్ అయిందన్నారు. ఎటువంటి మైనస్ వృద్ధి కూడా లేదని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, టర్మ్‌లోన్‌కు రూ.300 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.150 కోట్లు, విద్యా రుణాలకు రూ.100 కోట్లు, గృహ రుణాలకు రూ.200 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్య నిర్దేశించుకున్నామన్నారు. ఇతర రుణాలకు గాను రూ.1550 కోట్లు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది డీసీసీబీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.19,000 కోట్ల వ్యాపారం చేస్తుండగా ఒక్క కరీంనగర్ జిల్లా బ్యాంకే రూ.5,626 కోట్ల వ్యాపారం చేసిందని కొండూరి రవిందర్ రావు వివరించారు. TSCAB మరియు NAFSCOB చైర్మన్ అయిన Mr రావు, PACS యొక్క కంప్యూటరీకరణ మరియు PACS కోసం కొత్త HR పాలసీని ప్రవేశపెట్టడంలో తెలంగాణ రాష్ట్ర సహకార సంస్థ మొత్తం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారని తెలిపారు. బ్యాంకు యంత్రాంగం టీమ్ వర్క్ చేయడం వల్లే నిరంతర లాభాలను గడించామని కితాబిచ్చారు. ఈ మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ పి రమేష్, డైరెక్టర్లు పి మోహన్ రెడ్డి, స్వామిరెడ్డి, సిఈఓ ఎన్ సత్యనారాయణరావు, నాబార్డు డిడిఎంపి అనంత్ తదితరులు పాల్గొన్నారు.