ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి !!

మనిషి మాట తర్వాత అంతగా విలువ ఇచ్చేది ప్రామిసరీ నోటుకే. కొన్ని సందర్భాల్లో మనిషి మాట కన్నా కూడా ఈ నోటుకే విలువ ఉంటుంది. పెద్ద మొత్తంలో ఒకరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు
ఈ నోటు రాసి ఇస్తారు. అప్పు ఇచ్చిన వారి ఇద్దరి మధ్య ఈ నోటు ఉంటుంది. ఇది ప్రామిసరీ నోటు
బయట ఏ షాప్స్ లో నైనా ఇది దొరుకుతుంది.
ఈ నోటు ఎన్ని రోజుల వరకు పని చేస్తుంది ? నోటు తీసుకునే ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ? అనే వివరాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ప్రస్తుతం డబ్బు విలువ రోజు రోజుకు పెరుగుతుంది. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఇవ్వండి. మన సొంత వారైనా డబ్బులు ఆలోచించే ఇవ్వండి. అప్పు తీసుకునే వారు
కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలిసి ఉంటుంది. తర్వాత అప్పు తీసుకున్న వారు ఇవ్వకపోయిన అప్పు ఇచ్చిన వారే పూర్తి బాధ్యత వహించాలి.

ప్రామిసరీ నోట్ పై కోటి రూపాయల వరకు అప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చినపుడు న్యాయవాది సాక్షిగా ప్రామిసరీ నోట్ రాసుకోవడం చాలా మంచిది.
తీసుకున్న అప్పు మొత్తం తిరిగి ఇచ్చే వరకు ప్రామిసరీ నోటు మీద సంతకం చేసి ఉంటే మూడు ఏళ్ల వరకు నోటు వ్యాలీడిటీ ఉంటుంది.

You cannot copy content of this page