తనయుడు చేసిన అప్పుకు… తండ్రి శవం వద్ద ఆందోళన

దిశ దశ, జగిత్యాల:

తాము ఇచ్చిన అప్పు తిరిగి తీర్చకుండా తప్పించుకున్న ఓ ప్రబుద్దుడిని రుణదాతలు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. చేసిన అప్పులు చెల్లించకుండా ఆస్థులు కూడ బెట్టుకుంటూ తమను మోసగిస్తున్నాడని రుణ దాతలు గ్రహించి చివరకు అతన్ని దొరకబట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్ణణానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తికి పట్టణానికి చెందిన కొంతమంది అప్పులు ఇచ్చారు. అయితే తమ డబ్బులు తమకు ఇవ్వాలంటే తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో రుణదాతలు అవకాశం చూస్తున్న క్రమంలో శ్రీకాంత్ తండ్రి ఆదివారం మరణించాడు. తండ్రి అంత్యక్రియల కోసం మెట్ పల్లికి వచ్చిన అతన్ని పట్టుకుని తమ అప్పుల మాటేమిటని నిలదీశారు. చివరకు మరో వాయిదా పెట్టిన శ్రీకాంత్ అప్పులు ఇచ్చిన వారికి మరో అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చిన తరువాత అంత్యక్రియలకు అనుమతించారు. అయితే శ్రీకాంత్ కు అప్పు ఇచ్చిన వారు మాట్లాడుతూ… గతంలో కూడా అతన్ని డబ్బులు ఇవ్వాలని అడిగిన ఇవ్వలేదని, హైదరాబాద్ లో,  మెట్ పల్లిలో ఆస్థులు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. గతంలో ఓ సారి ఇలాగే వచ్చి వెల్లిపోయాడని ఈ రోజు అతని తండ్రి మరణించడంతో అతనితో అగ్రిమెంట్ రాయించుకోవల్సి వచ్చిందన్నారు. శ్రీకాంత్ కు వచ్చే వాటా ఆస్థిని విక్రయించి అప్పులు చెల్లిస్తానని రాయించిన తరువాత కాని రుణ దాతలు శాంతించలేదు. మెట్ పల్లి పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనను చూసైనా అప్పులు తీసుకుని తప్పించుకుని తిరిగే వారికి తగిన గుణపాఠం రావాలని రుణ దాతలు ఆకాంక్షించారు.

You cannot copy content of this page