సాత్విక్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ చనిపోయాడని రిపోర్టులో పేర్కొన్నారు. సాత్విక్‌ను అసభ్యకరంగా తిట్టడం వల్లే మనస్తాపం చెందాడని వివరించారు. తోటి విద్యార్థుల ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్లు వివరించారు.

శ్రీ చైతన్య కాలేజీ అడ్మిన్‌ ప్రిన్సిపల్‌ నర్సింహాచారి అలియాస్‌ ఆచారి, కృష్ణారెడ్డి రోజూ స్వాతిక్​ను తిట్టడంతో మానసికంగా కుంగిపోయాడని పోలీసులు చెప్పారు. సాత్విక్​ చనిపోయే రోజు తల్లిదండ్రులు వచ్చి వెళ్లగానే.. సాత్విక్‌ను ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి చితకబాదినట్లు పోలీసులు వెల్లడించారు. ఆచారి, కృష్ణారెడ్డి సాత్విక్​ ఇంట్లో వారిని బూతులు తిట్టారని వివరించారు. మరోవైపు హాస్టల్‌లో సాత్విక్‌ను వార్డెన్ వేధింపులకు గురి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాత్విక్‌ను.. కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనై మార్చి 1న కాలేజీలోని క్లాస్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాజమాన్యం సరైన సమయంలో స్పందించి ఉంటే సాత్విక్​ బతికేవాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఎప్పుడూ మార్కుల గురించి సాత్విక్‌​ను మానసికంగా చిత్రహింసలు చేసేవారని.. సాత్విక్ తమకు చెప్పేవాడని తోటి విద్యార్థులు వివరించారు.

You cannot copy content of this page