తప్పించుకున్న కొడుకు
దిశ దశ, భూపాలపల్లి:
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కసాయిగా మారిన ఓ ప్రబుద్దుడు తన భార్య, బిడ్డలను కడతేర్చాడు. చిరు ప్రాయంలో ఉన్న కొడుకును కూడా చంపే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోవడంతో బ్రతికిపోయాడు. బుధవారం రాత్రి వేషాలపల్లిలోని ఎలుగంటి రమణా చారి తన భార్య రమ (43), కూతురు చందనలను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనలో విశ్వ అనే నాలుగేళ్ల కొడుకు తండ్రి కంట కనబడకుండా తప్పించుకుని పారిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ హత్యలకు రమణాచారే కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. ఘటన స్థలంలో హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించడంతో పాటు నిందితుని కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు.