దిశ దశ, హైదరాబాద్:
కోకాపేట ఆ పేరు వినగానే అక్కడ భూముల ధరలు అడ్డగోలుగా ఉంటాయని అందరు అనుకుంటుంటారు. సాఫ్ట్ వేర్ భూంతో అక్కడ ఇప్పటికే ఆకాశాన్ని తాకిన భూముల ధరలు తాజాగా జరిగిన వేలంలో జరిగిన అమ్మకాల తీరు తెలిస్తే షాకుకు గురి కావల్సిందే. బహిరంగ వేలంలో కోకాపేటలో ఎకరా భూమి ఎంత పలికిందో తెలుసా..? ఎకరా భూమికి రూ. 100.75 కోట్లు పలకడం సంచలనంగా మారింది. హెచ్ఎండీఏ వేలం ద్వారా అమ్మిన ఈ భూమికి పలికిన ధర బహుష దేశంలో అత్యధిక ధరలకు విక్రయించిన జాబితాలో స్థానం సంపాదించి ఉండొచ్చని ఓ అంచనా. ఎకరా భూమికి వంద కోట్లు పలికిందంటే కోకాపేట ప్రాంతంలో ఎలాండి డిమాండ్ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. గురువారం హెచ్ఎండీఏ చేపట్టిన భూముల వేలంలో నియో పోలీస్ లే అవుట్ లో 6 నుండి 14 వరకు ప్లాట్లను విక్రయించేందుకు వేలం వేసింది. ఇందులో 100వ నెంబర్ ప్లాట్ కు పలికిన ధర ఎకరాకు 100.75 కోట్లు కాగా ఈ బిట్ కే దాదాపు 350 కోట్ల వరకు హెచ్ఎండీఏకు ఆధాయం వచ్చినట్టయింది. నియో పోలీస్ ఫేజ్ 2లోని 45.33 ఎకరాల స్థలాన్ని విక్రయించి రూ. 2,500 కోట్లు సమీకరించుకోవాలని అంచనా వేసినప్పటికీ ఓపెన్ యాక్షన్ జరుగుతున్న తీరు గమనిస్తే అంతకు ఎక్కువగానే ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో 9వ నెంబర్ ప్లాట్ కు రూ. 275.4 కోట్ల ధర పలికింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post