బీఆర్ఎస్‌లో చేరడంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ

బీజేపీతో క్లైమాక్స్ వార్‌కు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. బీజేపీ కీలక నేతలకు బీఆర్ఎస్ గాలం వేస్తోంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కీలక నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. తద్వారా బీజేపీని కోలుకుని దెబ్బ కొట్టే విధంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. తన ప్రత్యర్థి పార్టీలను నామరూపాల్లేకుండా చేసి తనకే పోటీనే లేకుండా చేసుకోవడం అనే వ్యూహనికి కేసీఆర్ మళ్లీ తెరలేపారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలందరినీ కేసీఆర్ బీఆర్ఎస్ వైపు లాక్కొని మంత్రి పదవులు ఇచ్చారు.

అలాగే టీడీపీలో కీలక నేతలను కూడా చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టిన కేసీఆర్.. ఇప్పుడు దూకుడు పెంచుతున్న బీజేపీని కూడా వీక్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో బీజేపీలోకి కీలక నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా నేతలెవ్వరూ బీజేపీలో చేరరని, దీని ద్వారా బీజేపీ చతికిలపడిపతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఈటలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోండగా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఆయనతో పాటు బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచాం జరుగుతోంది.

ఈ క్రమంలో బీఆర్ఎస్ లో చేరడంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ వ్యతిరేకులతోనే సరిపెట్టుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వ్యతిరేకులతోనే బీఆర్ఎస్ సంతృప్తి చెందాలని సెటైర్ వేశారు. తెలంగాణ వ్యతిరేకులే బీఆర్ఎస్ లో ఉన్నారని, తాను ఆ పార్టీలో చేరబోనని చెప్పారు. ఓ మాజీ ఎంపీతో పాటు ఈటల బీఆర్ఎస్ వైపు ఆసక్తి చూపుతున్నారని ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని షేర్ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీఆర్ఎస్ లో చేరిన కొంతమంది నేతల ఫొటోలను షేర్ చేశారు. వారి ఫొటోలను షేర్ చేస్తూ తెలంగాణ ద్రోహులు బీఆర్ఎస్ లో ఉన్నారని ఆరోపించారు.కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా.. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

You cannot copy content of this page