నేడు చిన్న హనుమాన్ జయంతి
దిశ దశ, జగిత్యాల:
ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల నినాదాలతో ఆలయం ప్రాంగణం మారుమోగుతోంది. ఓ వైపున హనుమాన్ భక్తుల మాల విరమణ మరో వైపున వాయుపుత్రుని దివ్య ఆశీస్సుల కోసం సాధారణ భక్తుల రాకతో కాషాయమయంగా మారిపోయింది. గురువారం చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అర్థరాత్రి నుండే భక్తులు కొండపైకి చేరుకోవడం ఆరంభం అయింది. దీంతో తెల్లవారే సరికి హనుమాన్ భక్తులు వేలాది మంది కొండగట్టు సన్నిధికి చేరుకోవడంతో కిటకిటలాడిపోతోంది. ఆలయ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాల విరమణ కేంద్రంలో వందాలది మంది భక్తులు దీక్ష విరమింపజేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అర్చకులను ఆలయ అధికారులు నియమించి ఎప్పటికప్పుడు మాల విరమణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు మాల విరమణ కేంద్రం వద్ద బారులు తీరగా, మరో వైపున స్వామి వారిని దర్శించుకునేందుకు కూడా భక్తజనంతో గర్భాలయ ప్రాంగణం నిండిపోయింది. అంజన్న దర్శనానికి నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతోంది. పోలీసులు కూడా భారీగా కొండగట్టు అంజన్న ఆలయం ప్రాంగణంలో మోహరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేస్తున్నాయి.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post