దిశ దశ, జగిత్యాల:
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం ఈఓగా ఉన్న ఆయన అవకతవకలకు పాల్పడ్డారన్న కారణంగా టి వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రొసిడింగ్స్ ఆర్ సి నంబర్: V1/4054/2024-1 తేది: 23.03.2014న టి వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 21న అడిషనల్ కమిషనర్ కె జ్యోతి ఈ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
