ఎమ్మెల్యే యెన్నం, కాంగ్రెస్ నేత కేకేలకు కూడా
దిశ దశ, హైదరాబాద్:
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు లీగల్ ఫైట్ తోనే తేల్చుకుంటానని చెప్తున్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు చేస్తున్న వారు ఎవరైనా సరే వదిలేది లేదని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే పలు మీడియా సంస్థలు, సోషల్ మీడయా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ తాజాగా పొలిటికల్ లీడర్ల్ తోనూ లీగల్ ఫైట్ కు సై అంటున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత, సిరిసిల్లలో తన ప్రత్యర్థి కెకె మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పనట్టయితే పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసేవారు ముఖ్యమంత్రి అయినా సరే వదిలి పెట్టేది లేదని చట్ట ప్రకారం కఠిన చయర్యలు తప్పవని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సబంధం లేని విషయాల్లో ప్రస్తావిస్తూ… అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి మీడియా సంస్థలు, సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపించారు.