దిశ దశ, కాళేశ్వరం:
త్రివేణి సంగమం, త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరంలో ముగ్గురు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. మహా కుంభాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ముగ్గురు కాళేశ్వరం సందర్శించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి నేతృత్వంలో ముఖ్యమైన ఘట్టం ఆదివారం పూర్తయింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద పండితుల మంత్రోఛ్చారణలతో అంగరంగ వైభవంగా సాగింది. తెలుగు రాష్ట్రాల నుండి క్షేత్రానికి చేరుకున్న రుత్వికులు శతచండీ మహారుద్ర, సహస్ర ఘాటాభిషేక కుంభాభిషేక మహోత్సవం నిర్వహించింది దేవాదాయ శాఖ. చివరి రోజున ఆలయ రాజగోపురం వద్ద కుంభాభిషేకం నిర్వహించారు పీఠాధిపతి. ఆలయంలో ప్రత్యేకంగా యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామికి అభిషేకం చేశారు. అనంతరం కుంభాభిషేకంలో పాల్గొన్నారు.
ముగిసిన ఉత్సవం…
మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం ఆదివారం ముగిసింది. 10.42 గంటలకు కుంభాషికం ముగిసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడంతో ఈ కార్యక్రమం ముగిసిందని ఆలయ అధికారులు తెలిపారు.