విటమిన్ డి లోపిస్తే.. ఈ అనారోగ్య సమస్యలు వచ్చినట్టే !

మన శరీరంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కాల్షియం, ఫాస్ఫేట్ పరిమాణాన్ని నియంత్రించడానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎముకలు, దంతాలను బలంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో విటమిన్ డి ఉండాల్సినంత ఉండకపోతే పిల్లలలో అయితే రికెట్స్ వంటి ఎముకల వ్యాధి వస్తుంది. మనం అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. అయితే మనలో చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ఇది లోపించడం వల్ల ఏ ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

విటమిన్ డి లోపంతో…

శరీరంలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనంగా అవుతాయి. ఇది మాత్రమే కాకుండా బోలు ఎముకల వ్యాధితో పాటు, పగుళ్ల ప్రమాదాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో అయితే రికెట్స్ వ్యాధి రూపంలో బయట పడుతుంది. . ఈ లోపం లోపం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

విటమిన్ డి లోపం సంకేతాలు

శరీరంలో విటమిన్ డి లెవెల్స్ తగ్గినప్పుడు అది రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది. దీని వల్ల తరచుగా ఫ్లూ లేదా జలుబు వంటి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇది లోపించడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు . కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

You cannot copy content of this page