ఆమె అప్రమత్తం చేయకపోతే… రావిరాల వాసి ధైర్య సాహాసం…

(ఎంఏ ఫయాజ్)

దిశ దశ, మహబూబాబాద్:

అర్థరాత్రి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి… గాఢ నిద్రలోకి గ్రామమంతా జారుకుంది… అంతలోనే ఉప్పెనలా వచ్చిన వరద ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కొద్దిపాటి వెలుతురో వరధ ఉధృతిలో కొట్టుకపోతున్న సామాగ్రిని గమనించి ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించారు. గ్రామస్థులందరిని అప్రమత్తం చేయడంతో ఈ ఊరిలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరకుండా జాగ్రత్తపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలోని లక్ష్మీ అనే మహిల ప్రధర్శించిన ధైర్యం అంతా ఇంతాకాదు. ఆగస్టు 30 శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానుకోట జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఆకేరు వాగుతో పాటు చిన్నా చితక కాలువలు పొంగిపొర్లగా గ్రామాల్లోని చెరువులు, కుంటలు కూడా కట్టలు తెంచుకున్నాయి. దీంతో మానుకోట ఖిల్లాలోని గ్రామాలన్ని కూడా జల దిగగ్భధనంలో చిక్కుకున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే వరద ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో విపత్తు తెచ్చిన తంటా గురించి వెలుగులోకి వస్తోంది. ప్రశాంతంగా నిద్రలోకి వెల్లిన పల్లెలను తీరని నష్టాన్ని చేకూర్చిన వరదల ప్రభావం తాలుకు నష్టాలను చూసి కన్నీరు మున్నీరవుతోంది మహబూబాబాద్ జిల్లా. అయితే జిల్లాలోని రావిరాల గ్రామానికి చెందిన ఓ మహిళ గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో అందరి ప్రాణాలను కాపాడింది. వరద బీభత్సంలో కొట్టుకపోతున్న మంచాలు, ఇండ్లలోని సామాగ్రిని కళ్లారా చూసిన ఆమె తెగువను ప్రదర్శించింది. వరద నీటిలో చిక్కుకున్న గ్రామమంతా కలియతిరిగి నిద్రలో ఉన్న వారందరిని తట్టి లేపింది. అప్పకప్పుడు గ్రామస్థులంతా సురక్షిత ప్రాంతానికి తరలిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

బతుకమ్మల వలె కొట్టుకపోతున్నాయ్: లక్ష్మీ

గ్రామంలోకి వరద నీరు చొచ్చుక వచ్చిన విషయాన్ని గమనించి పరిశీలిస్తే మంచాలు, బల్లలు, కూలర్లు కొట్టుకపోతున్నాయ్. వరద ఉదృతిలో తాము కూడా కొట్టుకపోయే పరిస్థితి ఉందని గమనించాను. వెంటనే గ్రామంలోకి వెల్లి అందరిని నిద్ర నుండి లేపి, ఇంట్లో సామాన్లు ఎన్ని కొట్టుకపోయినా మంచిదే కాని… మనమంతా ప్రాణాలతో ఉండాలని భావించాం. వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలి వెల్లి బిక్కుబిక్కుమంటూ గడిపాం. లేనట్టయితే గ్రామస్థులు కొంతమంది వరద నీటిలో కొట్టుకపోయే వారు.

రెడ్ క్రాస్ సొసైటీ బాసట…

భారీ వర్షాలు, వరదలతో ముంచెత్తిన గ్రామస్థులకు బాసటనివ్వాలని భావించిన రెడ్ క్రాస్ సొసైటీ పల్లెలకు వెల్లి తమవంతు సహకారాన్ని అందిస్తోంది. వరద నీటి కారణంగా కష్టాలు పడుతున్న స్థానికులకు ఆహార సామాగ్రిని అందజేస్తోంది. ఈ క్రమంలో రావిరాలకు చేరుకున్న రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు లక్ష్మీ చేసిన సాహసాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించిన దైర్య సాహసాలు తెలుసుకుని అభినందించారు.

You cannot copy content of this page