డూలింగో ఎగ్జామ్స్ లోనూ మాస్ కాపీయింగ్…

దాడి చేసి పట్టుకున్న ఎస్ఓటీ

దిశ దశ, హైదరాబాద్:

విదేశాలకు వెల్లేందుకు అర్హత సాధించే పరీక్షను కూడా కాపీ కొట్టే దందా మొదలు పెట్టారు కొందరు. అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడేందుకు ఉవ్విళ్లూరుతున్న వారు ఆన్ లైన్ లో ముందుగా డూలింగో ఎగ్జామ్ కు అటెండ్ కావల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఎల్జిబిలిటీ అయితేనే అమెరికా ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంటుంది. దీంతో ఈ పరీక్షలో ఫెయిల్ అయితే తమ కలలు సాకారం చేసుకోలేమని భావించిన కొంతమంది మాస్ కాపీయింగ్ టీమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. మాస్ కాపీ చేసేందుకు కూడా కొన్ని ముఠాలు రంగంలోకి దిగినట్టుగా గుర్తించిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్ఓటీ) రంగంలోకి దిగింది. మంగళవారం హైదరాబాద్ లోని హయత్ నగర్ లోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న డూలింగ్ ఎగ్జామ్ ను నకిలీ అభ్యర్థి ద్వారా రాయిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి నుండి రూ. 10 వేల వరకూ వసూలు చేస్తూ ఈ పరీక్షల్లో అర్హత సాధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే సాధారణంగా కాలేజీల్లో రాయించాల్సిన ఈ పరీక్షలు ఓ లాడ్జిలో నిర్వహిస్తుండడం విశేషం. ఇందులో ఓ యూనివర్శిటీతో పాటు ప్రముఖులకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్టుగా ఎస్ఓటీ గుర్తించింది. నకిలీ అభ్యర్థుల ద్వారా ఆన్ లైన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పుడుతున్న అభ్యర్థితో పాటు ముఠాను కూడా పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు హయత్ నగర్ స్టేషన్ కు అప్పగించారు. వీరి నుండి ఓ ల్యాప్ టాప్, నాలుగు పాస్ పోర్టులు, ఏడు సెల్ ఫోన్లుతో పాటు ఇతరాత్ర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ నివాసి, హైదరాబాద్ కు చెందిన కందికట్ల ప్రవీణ్ రెడ్డి, హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు చెందిన త్రివేది హరినాథ్, ఎల్ బి నగర్ ప్రగతి నగర్ కు చెందిన బానాల కృఫ్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరికి చెందిన ఎడవల్లి అరవింద్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలగిరికి చెందిన నెనావత్ సంతోష్, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం నాగారంకు చెందిన మల్లాడి నవీన్ కుమార్, నల్గొండ జిల్లా చందనపల్లి అలుకుంట్ర వినయ్ లను అరెస్ట్ చేశారు.

You cannot copy content of this page