కేంద్ర మంత్రి ముందు స్పీచ్ ను అడ్డుకున్న నేతలు
దిశ దశ, హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశం రసాభసాగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ప్రసంగాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. మంగళవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల నేపథ్యంలో రైల్వే, జలశక్తి సహాయ మంత్రి సోమన్న జమ్మికుంటలో పర్యటించారు. ఈ సందర్బంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ… కాళేశ్వరం, భీమా పథకాలతో పాటు రైతు భీమా… రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు అమలు చేశారన్నారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు వంటి అంశాలను తన ప్రసంగంలో ఊటంకిస్తున్న క్రమంలో సమావేశానికి హాజరైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డు తగిలారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న నాయకులను పోలీసులు శాంతిపంజేసే ప్రయత్నం చేసిన మొదట ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత ఇరు పార్టీల నాయకులు శాంతించడంతో సమవేశం యథావిధిగా కొనసాగింది. అయితే అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రోటోకాల్ కు విరుద్దంగా వ్యవహరించారంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి