భారీగా డబ్బులు వెచ్చించి సమాజాన్ని ఆకర్షిస్తుందనుకోవడం… అలా చేసి బోల్తా పడడం కామన్ గా మారిపోయింది. సమాజాన్ని ఆకర్షించాలంటే వినూత్న పద్దతులను అవలంబించి అంచనాలకు మించి డబ్బు ఖర్చు పెట్టడం వల్లే సాధ్యమవుతుందని భ్రమిస్తుంటాం. కానీ ఒక్కోసారి తక్కువ ఖర్చుతోనూ లక్ష్యాన్ని మించి కలెక్షన్ సాధించవచ్చని నిరూపించిన వారూ లేకపోలేదు. సరిగ్గా అలాంటి కోవకే వస్తుందీ ఈ మూవీ. మళయాళంలో తీసిని ‘జయ జయ జయ జయహే’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొంది రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 42 రోజుల్లో తీసిన ఈ మూవీ విపిన్ దాస్ దర్శకత్వంలో తీర్చదిద్దగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు దీనిని ఆదరించడంతో ఏకంగా రూ. 40 కోట్ల కలెక్షన్స్ సాధించింది. చిన్న బడ్జెట్ తో సింప్లిసీటితోనూ ప్రేక్షకులను తమవైపు తిప్పుకుని సక్సెస్ సాధించిన ఈ మూవీ యూనిట్ ను అభినందించాల్సిందే మరి. ఇంతకీ ఈ మూవీ తీయడానికి ఎంత ఖర్చయిందో తెలుసా…? కేవలం రూ. 6 కోట్లు.