వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) నిర్ణయం
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియా ఆఫ్ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని, జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకవచ్చే విధంగా పని చేయాలని డబ్లూజేఐ సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని నిర్ణయించింది. పాత్రికేయుల సంక్షేమం కోసం భారతీయ మజ్జూర్ సంఘ్‌కు అనుబంధంగా ఏర్పాటై… జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో ఆత్మీయ స’మ్మేళ’నం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధాన కార్య దర్శి రాంరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ లు హాజరయ్యారు. పాత్రికేయుల సమస్యలపై పోరాడుతున్న డబ్ల్యూజేఐకు తాము అండగా ఉంటామని ప్రకటించారు.
సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ మాట్లాడుతూ… డబ్ల్యూజేఐ అన్ని జిల్లాలకు విస్తరించాల’ని సూచించారు. నిరంతరం కార్యక్రమాలు చేపట్టాలని , బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ డబ్ల్యూజేఐకు అండ’గా ఉండటం సంతోషకరం అన్నారు. జాతీయ స్థాయిలో పాత్రికేయుల సమస్యలను లేవనెత్తేందుకు దోహదపడుతుందన్నారు.
ఆత్మ గౌరవంతో పోరాడుదామని, అందరి మేలు కోసం పాటుపడదామని, జాతీయ ప్రయోజనాలు కాపాడుకుందామని ఉన్నాయి. జర్నలిస్టుల విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని సీనియర్ ఎడిటర్, రచయిత ఎన్వీఆర్ శాస్త్రి అభిప్రాయ పడ్డారు. వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న డబ్ల్యూజేఐని అభినందించారు. డబ్ల్యూజేఐ గౌరవాధ్యక్షుడు నందనం కృపాకర్, రాష్ట్ర అధ్యక్షుడు రాణాప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్, కార్యక్రాంతి, సామాజిక కార్యకర్త తిరుమల్. కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయకులు కరుణాకర్, ప్రమోద్ కుమార్, హైదరాబాద్‌లోని పలువురు సీనియర్ పాత్రికేయలు, మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, యూనియన్ విస్తరణకు ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.