కటకం బాటలో కదంకదం కలుపుదాం

సామ్రాజ్య వాదుల శక్తులపై పోరాటం చేద్దాం

పశ్చిమ సబ్ జోనల్ అధికార ప్రతినిధి శ్రీనివాస్

దిశ దశ, దండకారణ్యం:

కార్పోరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి పర్యవరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే కటుకం సుదర్శన్ కు అసలైన నివాళి అని మావోయిస్టు పార్టీ దండకారణ్య పశ్చిమ సబ్ జోనల్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ అన్నారు. మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో చత్తీస్ గడ్ లోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలాి ప్రాంతాల్లో కార్పోరేటీకరణ శక్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఆదివాసీ అటవీ ప్రాంతంలో అపార ఖనిజ నిల్వలు ఉన్న క్షేత్రాలు కావడంతో వాటిని తరలించుకపోయేందుకు బహుళ జాతి కంపెనీలు 1990 నుండి తహతహలాడుతున్నాయని అన్నారు. 2014 వరకు ఈ శక్తులు సఫలం కాలేకపోయాయని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్పోరేట్ల ప్రయోజనాలు నెరవెర్చే పనులు ఊపందుకున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. దండకారణ్యంలోని తూలాడ్ మెట్ట, రావఘాట్, సుర్ఖా ఘాట్ లలో గనుల తవ్వకాలు ప్రారంభం అయ్యాయని, వేలాది టన్నుల ముడి పదర్థాలు తరలించుకపోతున్నారన్నారు. గనుల తవ్వకాల కోసం అడవుల్లో ఖాకీ బలగాలతో నింపేశారన్నారు. కార్పోరేట్ వర్గాల కోసమే 2005 నుండి 09 వరకు సల్వా జుడుంను, 2009 నుండి 17 వరకు ఆఫరేషన్ గ్రీన్ హంట్, 2017 నుండి 22 వరకు ఆపరేషన్ సమాధఆన్, ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ మోప్లాన్ (రియాక్షనరీ సూరజుండ్ చింతన్ శిబిర్ మిలటరీ ఆపరేషన్ ప్లాన్) కొనసాగుతోందని శ్రీనివాస్ ఆరోపించారు. వనరులను, ప్రజలను కాపాడుకోవాలని, ఆదివాసులను, అడవులను పరిరక్షించుకోవాలసి ఉందన్నారు. తమపై ఆకాశదాడులు తీవ్రం చేస్తున్నా జల్, జంగల్, జమీన్ కోసం మా అధికారం కోసం మేం పోరాడుతామని ఆదివాసీలు దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. అన్ని విధాలుగా ఆదివాసీలను వెంటాడుతూ హక్కులను కాలరాస్తున్నా కార్పోరేట్ శక్తులకు ధారదత్తం చేయాలన్న కుట్రలను తిప్పికొట్టే పనిలోనే ఇక్కడి ఆదివాసి బిడ్డలు నిమగ్నమయ్యారని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఉత్తర్ బస్తర్లోని ఏ` అనే గ్రామంలో నూతన పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా మొదలైన ప్రజా పోరాటం, కంకేర్ జిల్లా దుర్గి కందుల్ బ్లాక్ కేద్దాలో 40 గ్రామాలకు పైగా ప్రజలు బంగారు గనుల సర్వేను వ్యతిరేకిస్తూ ధర్నా చేశారన్నారు. కొత్తగా నిర్మించతలపెట్టిన భానుప్రతాప్ నార్ నుండి గడ్చిరోలి రైల్వే లైన్ నిర్మాణంతో తమ అస్థిత్వం కోల్పోతామని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారన్నారు. మహారాష్ట్రలోని సుర్జాగఢ్ కొండలలో శరవేగంగా జరుగుతున్న గనుల తవ్వకాలను నిలిపివేయాలని, వాటిని విస్తరించకూడదని, కొత్తగా దంకోడివాహి ప్రాంతాల్లో గనుల తవ్వకాలను మొదలు పెట్టవద్దంటూ వందలాది గ్రామాల ప్రజలు ఆందోళనలకు పూనుకున్నారన్నారు. అయితే “ప్రజలను చీల్చు పనులు ప్రారంభించు”, “ఖాకీలను దించు-ప్రజలను అణచివేయు” అన్న విధానాలతో కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పశ్చిమ సబ్ జోనల్ అధికార ప్రతినిధి మండిపడ్డారు. డబ్బుల ఆశతో, ఇతర అనేక ప్రలోభాలతో, రాజకీయ ప్రయోజనాలతో మూలవాసీల్లోని దుష్ట శక్తులు – తెగ పెద్దలు, రాజకీయ నాయకులు, చట్ట సభల ప్రతినిధులు – కార్పొరేట్ వర్గాలకు దళారీలుగా మారుతున్నారని ఆందోళణ వ్యక్తం చేశారు. ఇలాంటి నిన్నటి కోవలోకే మహేంద్ర ఖర్మ, నేటి గడ్చిరోలీ జిల్లా అహెరీ రాజకుటుంబానికి చెందిన వర్తమాన ఎం.ఎల్.ఏ ధర్మారావ్ ఆత్రంలు వస్తారన్నారు. ఈ మధ్య కాలంలో నికో కంపెనీ ఏజంట్, భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుడు రాంజీ దోదీని విప్లవ గెరిల్లాలు మార్చ్ 28నాడు నిర్మూలించారని గుర్తు చేశారు. అడవుల్లో ఓ వైపు కార్పొరేట్ వర్గాలు, వారి రక్షణ, పనుల నిర్వహణ కోసం భద్రతా బలగాలు, మరోవైపు ప్రజలు, వారి అడవుల కోసం, రక్షణ కోసం, అధికారం కోసం విప్లవోద్యమం కొనసాగుతోందన్నారు. అయితే దూలా దాదా ఇచ్చిన పిలుపును అందుకుని సహజ వనరులను కాపాడుకునే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, జూన్ 5 నుండి ఆగస్టు 3 వరకు ఆయన స్మారకార్థం సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేక పోరాటం చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

You cannot copy content of this page