లిక్కర్ వ్యాన్ బోల్తా…

డ్రైవర్, క్లీనర్ సేఫ్

జగిత్యాల జిల్లాలో ఘటన

దిశ దశ, జగిత్యాల:

కరీంనగర్ నుండి మెట్ పల్లికి లిక్కర్ తరలిస్తున్న ఐచర్ వ్యాన్ బోల్తాపడింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ సేఫ్ అయ్యారు. కరీంనగర్ ఐంఎల్ డిపో నుండి లిక్కర్ లోడ్ చేసుకుని జగిత్యాల జిల్లా మెట్ పల్లికి వెల్తుండగా వ్యాన్ అదుపు తప్పింది. దీంతో కోరుట్ల పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద ఈ వ్యాన్ బోల్తాపడడంతో లిక్కర్ కార్టన్లన్ని చెల్లాచెదురయ్యాయి. అర్థరాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు త్వరగా అందుకోలేకపోయారు. ఈ ఘటనలో కొన్ని మద్యం బాటిల్లు కూడా ధ్వంసం అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ నారాయణ, క్లీనర్ శ్రీకాంత్ లు సురక్షితంగా బయటపడ్డారని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page