ఉత్తమ్ సీరియస్: మేడిగడ్డపై సమీక్ష…

దిశ దశ, హైదరాబాద్:

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమీక్ష జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించి 24 గంటలు గడవక ముందే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ గ్రూప్స్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్ తో పాటు పలువురు ప్రతినిధులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకం పనులు ఎలా చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.  ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించడానికి భాద్యులైన వారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన  పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

You cannot copy content of this page