విద్యా కమిషన్ ను అబ్బుర పర్చిన విద్యార్థులు…

సర్కారు బడిలో సుగంధ పరిమళాలు…

దిశ దశ, మహదేవపూర్:

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ప్రతిభను చూసిన విద్యాశాఖ కమిషన్ ఛైర్మన్, సభ్యులు అబ్బురపడిపోయారు. క్రియేటివిటీకి పదును పెడుతున్న విద్యార్థుల మేథస్సును అభినందించింది. తెలంగాణ విద్య కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, సభ్యులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. విద్యా వ్యవస్థలో తీసుకరావల్సిన మార్పుల గురించి క్షేత్ర స్థాయిలో సలహాలు, సూచనలు తీసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపట్టింది. ఇందులో భాగంగా మహదేవపూర్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు చూపిన ప్రతిభా పాటవాలను వారిని ఆశ్యర్యంలో ముంచెత్తాయి. ఐ కోడింగ్ విధానాన్ని విద్యార్థులు కమిషన్ ఛైర్మన్, సభ్యుల ముందు ప్రదర్శించారు. భారత రక్షణ విభాగానికి అవసరమయ్యే విధంగా కోడింగ్ తయారు చేసిన తీరును విద్యార్థులు ప్రదర్శించారు. సర్కారు పాఠశాల విద్యార్థులు ఈ స్థాయిలో ప్రతిభ చూపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తొలి ఉద్యోగం అక్కడే…

విద్యాశాఖ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆకునూరి మురళీ తొలిసారిగా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసింది మహదేవపూర్ బ్లాక్ కార్యాలయంలోనే కావడం విశేషం. 1970వ దశాబ్దంలో ఆకునూరి మురళీ ఉద్యోగం చేసిన మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల క్రియేటివిటీని చూసిన ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ విద్య వ్యవస్థలో సంస్కరణలు తీసుకరావల్సిన తీరుపై ఆయన ఉపాధ్యాయల నుండి వివరాలు సేకరించారు.

You cannot copy content of this page