రాణాపూర్ లో ముగిసిన మల్లయ్య అంత్యక్రియలు…

హాజరైన సానుభూతి పరులు…

దిశ దశ, పెద్దపల్లి:

సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఎగులోపు మల్లయ్య అలియాస్ మధు ఉరఫ్ కోటి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన రాణాపూర్ లో జరిగాయి. ఈ నెల 1న ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని చల్పాక వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లు ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ కు చెందిన మల్లయ్య కూడా ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ మల్లయ్య భార్య మీనా హై కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మల్లయ్య మృతదేహాన్ని ఏటూరునాగారంలోనే పోలీసులు ఉంచారు. మల్లయ్య మృతదేహానికి పోస్టు మార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం రాణాపూర్ కు తరలించిన ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులతో పాటు విప్లవ అభిమానులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ… చల్పాకలో మరణించిన మావోయిస్టులకు అన్నంలో విషం కలిపి తినిపించి చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపించారు. ఎన్ కౌంటర్లన్ని ప్రభుత్వ హత్యలేనని, ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్ కౌంటర్లు కూడా ఈ విధంగానే జరిగాయని ఆరోపించారు. పౌర హక్కుల సంఘాల ప్రతినిదులు కూడా పెద్ద సంఖ్యలో రాణాపూర్ కు చేరుకున్నారు.

మల్లయ్య ప్రస్తానం…

1993 నుండి 1996 వరకు ఎగులోపు మల్లయ్య మొదట పెద్దపల్లి దళ సభ్యనిగా, 2000 వరకు చత్తీస్ గడ్ లోని బస్తర్ జిల్లా కమీటీ సభ్యునిగా, కమాండర్ గా, 2021 వరకు కంకేర్ జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఏటూరునాగారం, మహాదేవపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ కాలం మావోయిస్టు పార్టీలోనే కొనసాగిన మల్లయ్య శవమై ఇంటికి చేరడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

విప్లవోద్యమాల ఖిల్లా…

పెద్దపల్లి ప్రాంతంలో 1970వ దశాబ్దం నుండే విప్లవ భావంజాలం ఉండేది. ఎర్ర జెండా నీడన ఉద్యమ బాట పట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇదే బాటలో రాణాపూర్ వాసులు కూడా నడిచారు. 1982లో జయ్యారం ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరనించిన బయ్యపు దేవేందర్ రెడ్డి రాణాపూర్ కు చెందిన వాడే. ఇదే గ్రామానికి చెందిన కనకయ్య అలియాస్ సాగర్ కూడా ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. రాణాపూర్ నుండి పెద్ద సంఖ్యలో పార్టీ సానుభూతిపరులు ఉండేవారు. వారిలో కొంతమంది ఎదురు కాల్పుల్లో మరణించారు. 1980 నుండే గ్రామంలో విప్లవ కార్యకలాపాలు కొనసాగేవి. దున్నేవాడికే భూమి అన్న నినాదాన్ని అందిపుచ్చుకుని ఈ గ్రామానికి చెందిన నాటి యువత ఎర్ర జెండా ఎత్తి విప్లవ పంథావైపు పయనించింది. రాణాపూర్ కు చెందిన ఎగులోపు మల్లయ్య కూడా అదే పంథాలో ముందుకు సాగి చల్పాక్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. గత కొంతకాలంగా ఎర్ర జెండాలు కనిపించని రాణాపూర్ మల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో ఎరుపెక్కిపోయింది. గ్రామంలో విప్లవకారుల నినాదాలు మిన్నంటిపోయాయి. ఎగులోపు మల్లయ్యను కడసారి చూసి నివాళులు అర్పించేందుకు వచ్చిన వారిలో
పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క నారాయణ రావు,
రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నాయకులు బల్ల రవి, నిర్భంద వ్యతిరేక వేదిక రాష్ట్ర నాయకులు K రవిచంద్ర, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, శాంతక్క, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభక్క, సామాజిక ఉద్యమ కారులు ఎరుకల రాజన్న, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్, విప్లవ రచయితల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, న్యూ డెమోక్రసి, IFTU రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య, జిల్లా కో కన్వీనర్ గాండ్ల మల్లేశం, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మర్వాడీ సుదర్శన్, పెద్దపల్లి కన్వినర్ రామిల్ల బాపు, తెలంగాణ రైతు కూలి పోరాట సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రత్న కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుతురు సదానందం, పౌరహక్కుల సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్ల సుచరిత, ఉపాధ్యక్షులు నారా వినోద్, జిల్లా కమిటీ సభ్యులు రెడ్దిరాజుల సంపత్, బండారి రాజలింగు, పౌరహక్కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, ఉపాధ్యక్షుడు రంజిత్, జయంత్, ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సారయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మంచిర్యాల కన్వీనర్ జైపాల్ సింగ్, కరీంనగర్ జిల్లా కన్వీనర్, అయిందల అంజి, ప్రజాసంఘాల నాయకులు పులిపాక రవీందర్, మంచినీళ్ల లింగన్న, రెడ్డి రాజుల రాజన్న, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు దేవి సత్యం, రామగిరి మండల కాంగ్రెస్ నాయకుడు అరెల్లి కొమురయ్య, ఏనుగు మల్లారెడ్డి, పార్వతి, మహిళా సంఘం నాయకురాలు పద్మలు ఉన్నారు.

You cannot copy content of this page