ఇటీవల ఎయిర్‌లైన్స్ సంస్థల వల్ల సినీ సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యంగా భారత ఎయిర్ లైన్ ఇండిగో సంస్థ వల్ల నటీనటులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. స్టార్ హీరో రానా నుంచి యాంకర్ అనసూయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ వరకు ఇలా ఎందరో ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి మంచు లక్ష్మి చేరింది. ఇటీవల తిరుపతి వెళ్లిన మంచు లక్ష్మీకి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది.
విమానంలో మర్చిపోయిన తన బ్యాగు కోసం 40 నిమిషాలు ఎదురుచూశానని మంచు లక్ష్మీ తెలిపారు. సోమవారం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో మంచు లక్ష్మి బయలు దేరారు. అయితే ఆ సమయంలో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సాయం కోరితే ఆమె ప్రయాణించి సమయం కన్నా సదరు విమానయాన సిబ్బంది తీసుకున్న సమయం ఎక్కువ సేపంటూ సెటైర్ వేశారు.
‘ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కంటే త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. విమానంలో నా పర్స్ పోయింది. సాయం అడిగితే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. 103 డిగ్రీల జ్వరంతో దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేయిట్ చేశా. సాయం చేయడానికి ఏ ఒక్క సిబ్బంది రాలేదు. నేను హెల్ప్ అడిగిన క్షణాల్లోనే వారు కనుమరుగయ్యారు. ఇందుకు నాకు ఉన్న హైఫివర్ కూడా వారిని కదించలేదు. ఇండిగో.. దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా?’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన ఇండిగో యాజమాన్యం ‘మేడమ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మా మేనేజర్‌తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీరు మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి పొందడంలో మా సిబ్బంది మీకు సహాయం చేశారని అనుకుంటున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ రాసుకొచ్చింది.