మంచు మనోజ్ రెండో పెళ్లిపై స్పందించిన మంచు లక్ష్మి

భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి బయట కనిపించారు. దేవాలయాలు, ఫంక్షన్లకు కలిసి వెళ్లారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గతంలో మనోజ్ ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు మంచు మనోజ్ తన రెండో పెళ్లిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భూమా మౌనికరెడ్డితో లవ్ బ్రేకప్ అయిందా అనే వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో మంచు మనోజ్ రెండో పెళ్లి మంచు లక్ష్మి స్పందించింది. తాజాగా శ్రీకాళహస్తిలోని శివుని దేవాలయాన్ని మంచు లక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తాను పరమేశ్వరుడి భక్తురాలిని అని, చిన్నప్పటి నుంచి తిరుపతికి వచ్చిన ప్రతీసారి శ్రీకాళహస్తికి వస్తానని చెప్పారు. ఈ సందర్బంగా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి మీడియా మంచు లక్ష్మిని ప్రశ్నించింది. దీంతో గుడికి వచ్చినప్పుడు ఇలా పర్సనల్ విషయాలు అడగడం కరెక్టా. ఈ విషయాన్ని మీరు మనోజ్ నే అడగండి అని చెప్పింది.

ఈ సందర్భంగా మంచు విష్ణుపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ పై కూడా మీడియా ప్రశ్నించింది. దీంతో అది విష్ణుని అడగాల్సిన ప్రశ్న అని, తన సినిమాల గురించి తాను అడిగితే చెబతానని అన్నారు. అలాగే తాను నటించిన అగ్ని నక్షత్రం సినిమా గురించి మంచు లక్ష్మి స్పందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రానా ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేస్తాడని మంచు లక్ష్మి తెలిపింది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కాగా విబేధాల కారణంగా మంచు మనోజ్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత భూమి మౌనికతో ప్రేమతో పడ్డాడు. గతంలో వీరిద్దరూ కలిసి తిరుమలతో పాటు పలు దేవాలయాలను సందర్శించారు,. దీంతో త్వరలోనే పెళ్లి ఉంటుందని అందరూ భావించారు.

You cannot copy content of this page