మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా..!

దిశ దశ, ఏపీ బ్యూరో: ఁ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. రెండు మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్కే రాజీనామా అధికార వైసీపీలో చర్చకు దారి తీసింది. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ పై పోటీ చేసి గెలిచారు. నారా లోకేష్ ను ఓడించిన అభ్యర్థిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆర్కే రాజీనామా చేయడం వెనక కారణాలు ఏంటీ అన్న చర్చ మొదలైంది. మరో వైపున ఆయన వైస్ షర్మిల పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన షర్మిల ఏపీ ఎన్నికల్లోనూ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్ ఏంటన్న విషయంపై ఆయన ప్రకటిస్తే కానీ స్ఫష్టత వచ్చే అవకాశం లేదు.

You cannot copy content of this page