మంథని మధూకర్ కేసు…

గాయాలున్నది వాస్తమే…

దిశ దశ, పెద్దపల్లి:

ఆరేళ్ల క్రితం అనుమానస్పద స్థితిలో దళిత యువకుడి మరణంపై హై కోర్టుకు ఆయా విభాగాల నుండి రిపోర్టులు అందాయి. ఇటీవలే ఏసీపీ, పోస్టు మార్టం, ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరి(ఎఫ్ఎస్ఎల్) రిపోర్టులు హై కోర్టులో దాఖలు చేశారు. ఈ విషయంపై గురువారం విచారించిన కోర్టు మంథని మధూకర్ శరీరంపై గాయాలు ఉన్నాయని రిపోర్టుల ద్వారా స్పష్టమవుతోందని అభిప్రాయ పడింది. ఇది ఆత్మహత్య కాదు హత్యేనని నిర్దారించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది.

అసలేం జరిగింది..?

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ కు చెందిన మంథని మధూకర్ 2017 మార్చ్ 15న అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. మధూకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఐపీసీ 174 కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ తరువాత దళిత యువకుడు మధూకర్ వేరే సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడని ఈ కారణంగానే అతన్ని చంపేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని శరీరంలోని కొన్ని భాగాలు కూడా కట్ చేసేశారంటూ జరిగిన ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనగా మారింది. ఈ కేసులో హై కోర్టు అడ్వకేట్ రఘునాథ్ 2017 ఏప్రిల్ 6న రిట్ పిటిషన్ దాఖలు చేసి మధూకర్ ది ఆత్మహత్య కాదని హత్యేనని విన్నవించారు. దీంతో రీ పోస్ట్ మార్టంకు ఆదేశించండంతో కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన బృందం మంథని మధూకర్ మృతదేహాన్ని రీ పోస్ట్ మార్టం చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు జరిగిన రీ పోస్ట్ మార్టం నివేదికను సీల్డ్ కవర్ లో కెఎంసీ ప్రొఫెసర్ల బృందం, ఎఫ్ఎస్ఎల్, ఏసీపీ రిపోర్టులు గత జూన్ 21న హైకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించారు. వీటిని పరిశీలించిన హై కోర్టు మంథని మధూకర్ ది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ నిర్దారించింది. ఈ మేరకు అడ్వకేట్ వి రఘునాథ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కేసును ఆగస్టు 31కి హై కోర్టు వాయిదా వేసిందని కూడా వివరించారు.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid08Xi7LX9uGDQLrvBQk3KE4PX9zC9tV8v45L8MywM7njNTMRsaP3XBJvDJYWbLPyBKl&id=100063791050963&mibextid=Nif5oz

You cannot copy content of this page