ఒరిస్సా రాష్ట్రంలో బీఎస్ఎఫ్ జవాన్లు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో మందు గుండు సామాగ్రి నిల్వ ఉంచుకున్నారన్న సమాచారం అందుకున్న పారా మిలటరీ బలగాలు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. సోమవారం 177 బెటాలియన్ కు చెందిన బలగాలు మల్కాన్ గిరిలోని జోడంబో అటవీ ప్రాంతలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో జంత్రి పంచాయితీ పరిధిలోని అర్లింగ్ పాడలో మావోయిస్టుల డంప్ ను గుర్తించారు. ఈ సోదాల్లో 7 జిలిటెన్ స్టిక్స్, 14 డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్ బెండల్స్ 4, ఎ సైజ్ బ్యాటరీలు 6, 25 మీటర్ల ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రిక్ వైరు, 3 బెండిల్స్ పగిలిన గాజు ముక్కలు, ఒక టిఫిన్ బాక్సుతో పాటు మరిన్ని పేలుడుకు ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు పేల్చివేతల కోసం వేసిన స్కెచ్ లో భాగంగానే వీటిని మావోయిస్టులు సేకరించి డంప్ ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన వాటిని పరిశీలిస్తే భారీ విధ్వంసానికి రచన చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
Disha Dasha
1884 posts
Next Post