మావోయిస్టు పార్టీ @ 20

దిశ దశ, దండకారణ్యం:

పీపుల్స్ వార్… మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించి 20 ఏళ్ల పూర్తయింది. 2004లో శాంతి చర్చల సమయంలో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది పీపుల్స్ వార్. అప్పటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీపుల్స్ వార్ నక్సల్స్ తో శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ ప్రభుత్వం పీపుల్స్ వార్ నక్సల్స్ తో శాంతి చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 21న తాము ఎంసీసీలో విలీనం అవుతున్నామని, ఇక నుండి పీపుల్స్ వార్ అని కాకుండా మావోయిస్టు పార్టీ అని సంబోధించాలని కోరుతూ చర్చల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. దీంతో శాంతి చర్చల అనంతరం పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించినట్టయింది. మరో మూడు రోజుల నుండి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిపేందుకు సమాయత్తం అవుతోంది.

నెల రోజుల పాటు…

మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్ల అవుతున్న నేపథ్యంలో నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కోరారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించ తలపెట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా రాజకీయంగా, సైనికంగా పోరాటం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

You cannot copy content of this page