దిశ దశ, న్యూ ఢిల్లీ:
మావోయిస్టు పార్టీకి చెందిన మరో ముఖ్య నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ లోని గయా జిల్లా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి సీసీఎం మెంబరో తో పాటు మరోకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గయా పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. కేంద్ర కమిటీ సభ్యుడు, బీహార్ తూర్పు రీజియన్ చీఫ్ ప్రమోద్ మిశ్రా అలియాస్ సోహన్ దా, అలియాస్ వాన్ బిహారీ, అలియాస్ మదన్ జీ, అలియాస్ జనార్దన్ జీ, అనిల్ యాదవ్ లను అరెస్ట్ చేసినట్టు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ప్రమోద్ మిశ్రా ఔరంగబాద్ జిల్లా కస్మా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వ్యక్తి కాగా అనిల్ యాదవ్ గయా జిల్లా లుతువా ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై పెద్ద ఎత్తున విధ్వంసాలతో పాటు పలు కేసులు నమోదయి ఉన్నాయని గయా జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post