పీఎల్జీఏ విజయం ఇది…

దిశ దశ, దండకారణ్యం:

వార సంతలో బందోబస్తు నిర్వహిస్తున్న బలగాలపై కత్తితో డాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయంపై బస్తర్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఓ ప్రకటన విడుదల చేశారు. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా జాగరగుండ వీక్లీ మార్కెట్ లో రెండు రోజుల క్రితం బందోబస్తు నిర్వహిస్తున్న జవాన్లపై కత్తితో దాడి చేసిన ఘనత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) విజయమని సమత ఆ ప్రకటలో ప్రకటించారు. ఉపా వంటి చట్టాలతో సామాన్యులను జైళ్లకు పంపిస్తున్నారని, బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పుడుతున్నారని ప్రభుత్వంపై మండి పడ్డారు. మావోయిస్టులపై అణిచివేత తీవ్రంగా సాగుతున్న ఈ సమయంలోనూ జవాన్లపై దాడి చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కూడా ఆ దాడిని తమ సక్సెస్ అని ప్రకటించడం గమనార్హం.

You cannot copy content of this page