దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీలో మరో సీనియర్ నాయకురాలు అనారోగ్యంత బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో టైలరింగ్ టీమ్ సభ్యురాలిగా ఉన్న షేక్ ఇమాంబి అలియాస్ రాధక్క అలియాస్ జ్యోతక్క, అలియాస్ సాంబలక్ష్మీగా తెలిసింది. 54 ఏళ్ల వయసు ఉన్న జ్యోతక్క వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట నివాసి. 30 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన జ్యోతక్క పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం అరోగ్య సమస్యలు వెంటాడుతున్నందున ఆమె జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం తీవ్రమైన ఆనారోగ్యంతో ఉన్న ఇమాంబీ దండకారణ్య అటవీ ప్రాంతం నుండి స్వస్థలానికి రావాలని భావిస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.