దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కౌంటర్ అటాక్ చేసేందుకు భారీ వ్యూహ రచన చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర పారా మిలటరీ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్పెషల్ టీమ్స్ కీకారణ్యాల్లోకి చొచ్చుకపోతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు నక్సల్స్ పకడ్భందీగా దాడులకు పాల్పడుతోంది. మంగళవారం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన దాడిని పరిశీలిస్తే మావోయిస్టుల ఎత్తులు స్ఫస్టం అవతున్నాయి. ప్రాబల్య ప్రాంతాల్లోకి బలగాలు చొచ్చుకపోయి మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉన్న ప్రాంతాలకు కూడా బలగాలు చొరబడి బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బలగాలను తిప్పి పంపాలన్న వ్యూహంతో మావోయిస్టులు భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దండకారణ్య అటవీ ప్రాంతంలో తిరుగులేని పట్టు ఉన్న వారిని పీఎల్జీఏలో చేర్చుకున్న నాయకత్వం వారికి ట్రెడిషనల్ ఆర్మ్స్ తో పాటు ఆధునిక టెక్నాలజీపై కూడా పట్టు కల్పించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల బారి నుండి కాపాడుకునేందుకు ఆదివాసీలు తయారు చేసుకున్న విల్లులు, బరిసెలు వంటి సాంప్రాదాయ ఆయుధాలను తయారు చేసుకోవడం వాటిని వినియోగించడంలో బస్తర్ అటవీ ప్రాంతంలో సర్వసాధారణ విషయం. వీరిలో చురుగ్గా ఉన్న వారిని ఎంపిక చేసుకున్న మావోయిస్టులు పీఎల్జీఏలో రిక్రూట్ చేసుకుని ఆధునిక ఆయుధాలపై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కార్యకలాపాలతో మావోయిస్టులు బలగాలను మట్టుబెట్టే పనిలో నిమగ్నం అయిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులే లక్ష్యంగా పీఎల్జీఏను రంగంలోకి దింపినట్టుగా స్ఫష్టం అవుతోంది మంగళవారం నాడు జరిగిన టేకులగూడెం ఘటనను పరిశీలిస్తే. ఈ బేస్ క్యాంపు బలగాలు సమీపంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంపు ఇలాగే కొనసాగితే ఆ ప్రాంతంపై పట్టు సాధించే అవకాశాలు ఉంటాయని, ఆదిలోనే బలగాల స్కెచ్ కు చెక్ పెట్టాలన్న యోచనలతో ఈ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే బలగాలపై ముప్పేట దాడి చేసినట్టయితే జవాన్లు వెనక్కి తగ్గుతారని దీంతో తమ పట్టు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుందన్న అంచనాతోనే కొత్తగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులే లక్ష్యంగా పీఎల్జీఏ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
బలగాల ఎదురు దాడి…
అయితే ఈ ఘటనలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలు కూడా మావోయిస్టులపై ఎదురుదాడి దిగడంలో భారీ ప్రాణ నష్టాన్ని నిలువరించుకోగలిగాయి. మావోయిస్టులు అంబూష్ వేసుకున్నందున ఖచ్చితంగా జవాన్లు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగాల్సి ఉండే. కానీ మావోయిస్టుల దాడుల నేపథ్యంలో ఆపరేషన్లో పాల్గొ్న్న జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో నక్సల్స్ లక్ష్యానికి బ్రేకులు వేసినట్టయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించినప్పటికీ అప్రమత్తత లేనట్టయితే మరింత మంది కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండది. అయితే ఈ ఘటనలో మావోయిస్టులు కూడా భారీ ఎత్తున నష్టాన్ని చవి చూసి ఉంటారని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టులపై జవాన్లు భారీ ఎత్తున కాల్పులు జరపిన కొంతసేపట్లోనే నక్సల్స్ ఆ ప్రాంతాన్ని ఖాలీ చేసి వెల్లిపోయిన తీరును గమనిస్తే స్పష్టం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
500 మంది నక్సల్స్…
మంగళవారం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 500 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నారని కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన జవాన్లు చెప్తున్నారు. ఈ ఘటనలో గాయాలాపాలైన జవాన్లకు జగ్దల్‌పూర్ మెడికల్ కాలేజీలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లోని నారాయణ, బాలజీ హస్పిటల్స్ కు తరలించారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పరామార్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, అటవీ శాఖ మంత్రి కేదార్ కశ్యప్ కూడా సీఎం వెంట ఉన్నారు. మరో వైపున ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకున్న సుక్మా జిల్లా జాగరగుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం బేస్ క్యాంపుకు బస్లర్ ఐజీ సుందర్ రాజ్ కూడా పి కూడా మంగళవారమే హుటాహుటిన చేరుకున్నారు. ఎదరుక కాల్పుల ఘటనపై సమీక్షించిన ఆయన మావోయిస్టులను ఏరివేసే విషయంలో బలగాలు కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు. 2021లో జరిగిన ఎదురు కాల్పుల్లో బలగాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవి చూసినప్పటికీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతామని ప్రకటించారు. శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు అభివృద్ది జరపాలన్న సంకల్పంతో ఉన్న బలగడాలు టేకులగూడెం బేస్ క్యాంపును మరింత పటిష్ట పర్చి ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు.