పోలీసుల అదుపులో మావోయిస్టు సభ్యులు: వెంకటేష్ ఆరోపణ

దిశ దశ, భద్రాచలం:

మావోయిస్టు  పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారని ఆ పార్టీ నేత ఒక ప్రకటనలో ఆరోపించారు. వారిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జెఎండబ్లుపి) డివిజన్  కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు  సభ్యులు జైసింగ్, రమేష్ లను ఈ నెల 29న, సుక్కి అనే మెంబర్ ను  మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోలీసులు పట్టుకున్నారని వెంకటేశ్ ఆరోపించారు. వీరిని దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ ఎన్ కౌంటర్ చేసే ప్రయత్నాలుచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని 24 గంటల్లోగా కోర్టులో హాజరు పర్చాలని, వారికి ఎలాంటి హని తలపెట్టవద్దన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారికి ఏదైనా హాని జరిగినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాల్సి వస్తుందని వెంకటేశ్ స్పష్టం చేశారు. 

You cannot copy content of this page