భద్రాద్రిలో ఇద్దరు, గడ్చిరోలిలో ఒకరి అరెస్ట్
దిశ దశ, దండకారణ్యం:
గోదావరి, ఇంద్రావతి నదీ తీరాల్లో సరిహద్దు పోలీసులు హై అలెర్ట్ గా ఉంటున్నారు. మావోయిస్టుల ఉనికిని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మంగళవారం తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో ఒక ఎల్ఓఎస్ కమాండర్ తో పాటు దళ సభ్యురాలిని అరెస్ట్ చేయగా, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టు దళ సభ్యుడిని అరెస్ట్ చేశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఎల్ఓఎస్ కమాండర్ ఉంగళ్ ప్రదీప్ అలియాస్ విజ్ఞల్, దళ సభ్యురాలు మూసికి రాజీలను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ డాక్టర్ వినిత్ మీడియాకు వెల్లడించారు. వీరు చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బస్తర్ ఏరియాకు చెందిన వీరిపై పలు కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దళ సభ్యుడు సాధు అలియాస్ కల్యాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయని ఎస్సీ నిలోత్పాల్ వివరించారు.