ఆరు ఎయిర్ బ్యాగుల జిమ్నీ… కరీంనగర్ మార్కెట్ లోకి ఎంట్రీ…

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న వాహనం

దిశ దశ, కరీంనగర్:

అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకుని… ట్రావెల్ చేసే వారికి సకల సౌకర్యాలతో తయారు చేసిన మరో కొత్త వాహనం కరీంనగర్ మార్కెట్ లోకి వచ్చింది. న్యూ లుక్… న్యూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచే ఈ వెహికిల్ కరీంనగర్ లోని మారుతి సుజుకి నెక్సా షోరూంకు చేరింది. ఆఫ్ రోడ్ కార్ న్యూ జిమ్నీని శుక్రవారం ఎస్ బిఐ చీఫ్ మేనేజర్ నాగ ప్రవీణ్, సంస్థ ఎండి బి సత్యనారాయణ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ… మారుతీ సుజుకి జిమ్నీ బోల్డ్ లుక్ తో వస్తోందని, 9 అంగుళాల టచ్ స్క్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లే, అండ్రాయిడ్ ఆటో వంటి నూతన సౌకర్యాలను పొందుపరిచారన్నారు. దీర్ఘ చతురస్రాకారంలో ఉండే డ్యాష్ బోర్డు, గుండ్రని ఏసీ వెంట్లు, రేట్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ తో పాటు మరిన్ని కొత్త ఫీచర్లు జిమ్నీలో కలిగి ఉన్నాయని సత్యనారాయణ గౌడ్ వివరించారు. ఈ ఆఫ్ రోడ్ వెహికిల్ లో రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, వాహనంలో ప్రయాణించే వారి సేఫ్టీ మేజర్స్ తీసుకునే విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తుల తీసుకుందన్నారు. ఈ వాహనంలో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ, ఈఎస్పీ లాంటి న్యూ ఫీచర్స్ ను అమర్చడం జరిగిందని, అలాగే హిల్ డీసెంట్ కంట్రలో, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలెర్ట్, రియర్ వ్యూ కెమెరాల ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఆల్ గ్రిప్ ప్రో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం కూడా అమర్చడంతో న్యూ జిమ్నీ సరికొత్త హంగులను సంతరించుకుందని సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆధునిక సాంకేతితను అందిపుచ్చుకోవడంతో పాటు అన్ని రకాలా జాగ్రత్తు తీసుకుని తయారు చేసి మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనం కోసం సుదూర ప్రాంతాలకు వెల్లాల్సిన అవసరం లేదని, కరీంనగర్ లోని ఆధర్శ, మారుతి సుజుకీ నెక్సా షోరూంలో అందుబాటులో ఉందని తెలిపారు.

You cannot copy content of this page