మార్వాడీల దాండియా సందడి…

దిశ దశ, వరంగల్:

దేవి నవరాత్రలను పురస్కరించుకుని వరంగల్ నగరంలోని మార్వాడి సమాజ్ దాండియా ఆటలతో సందడి చేశారు. అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని నాగకన్య దేవాలయం వద్ద భవాని మాత నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సిక్వాల్ బ్రహ్మన్ సమాజ్ (మార్వాడి సమాజ్) ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా సాంప్రాదాయ బద్దంగి మార్వాడి సమాజ్ నిర్వహిస్తున్న వేడుకలు కనుల విందుగా సాగుతుంటాయి. ఈ ఏడాది కూడా అందులో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మార్వాడి సమాజ్ మహిళలు దాండియా ఆటలతో దేవి అమ్మవారి సేవలో తరించారు. తమ పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తున్న ఈ సాంప్రాదాయాన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన నాకన్య దేవాలయంలో మూడు దశాబ్దాలుగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నాగకన్య దేవాలయం అనుసంధానంగా సాగుతున్న ఈ భవాని మాత నవరాత్రుల పండుగకు ఓప్రత్యేక ఉందని ఇక్కడి మార్వడి వాసులు చెపుతున్నారు. ముఖ్యంగా సంతానం లేని వారికి నాగకన్య ఓ వరంలా ఆవిర్భవించిందని చెప్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తరువాత సంతానం కలగడంతో
సంతాన లక్ష్మిగా పేరుగాచిందని నిర్వహాకులు వివరించారు. ఈ కారణంగానే భక్తులు భవాని మాత రూపంలో నాగకన్యను పూజించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ సీక్వాల్ బ్రాహ్మణ సమాజ్ అధ్యక్షుడు భగీరథ పాండే, విజయ్ వ్యాస్, చందు జోషి, రమేష్ కొలారియా, వినోద్ పాండే, రాజేష్ ఉపాధ్యాయ, సిక్వాల్ బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు.

You cannot copy content of this page