భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

దిశ దశ, భద్రాద్రి జిల్లా:

తెలంగాణలో గత వైభవం కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి పోలీసులు నిలువరించారు. ప్రత్యేకంగా దళాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగించాలనకున్న ప్రయత్నంలో ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన దళం తుడిచి పెట్టుకపోయింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీలాద్రిపేట, గుండాల, కరకుగూడెం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ చనిపోయారు. గురువారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టు పార్టీ మణుగురు ఏరియా లోకల్ గెరిల్లా స్క్వాడ్ కమిటీ తారసపడడంతో ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మణుగురు, కొత్తగూడెం ఏరియా లోకల్ గెరిల్లా స్క్వాడ్ (LGS) కమాండర్, డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM), కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న(43) చనిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా రాయగూడెంకు చెందిన లచ్చన్నతో పాటు అతని భార్య, ఏరియా కమిటీ మెంబర్ (ACM), ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా పొంబాడ్ గ్రామానికి చెందిన పూనమ్ లక్కె అలియాస్ తులసి, సోడి బోమన్, సోడి కాసి, మరో ప్లాటూన్ సభ్యుడు. ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన కవ్వాసి రాము, చర్లకు చెందిన శుక్రంలు చనిపోయారు. వీరిలో ముగ్గురు ఏసీఎం క్యాడర్ లో ఉన్నారు. ఘటనా స్థలం నుండి 2 AK-47లు, ఇతరాత్ర మావోయిస్టులకు సంబంధించిన వాటిని రికవరి చేశారు.

జవాన్ కు గాయం…

మావోయిస్టు పార్టీ దళంతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్రే హౌండ్స్ కు చెందిన ఓ జావాన్ కు కూడా తీవ్ర గాయలయ్యాయి. అతన్ని భద్రాచలం తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు వేరే ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది.

పారా మిలటరీ వెల్లిన తరువాత…

తాజాగా భద్రాద్రి జిల్లా కరుకుగూడెం ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో రాష్ట్ర గ్రే హౌండ్స్ బలగాలు పాల్గొన్నాయి. చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో దశాబ్దాల కాలంగా సీఆర్పీఎఫ్ బలగాలు భద్రాతా చర్యల్లో పాల్గొనేవి. అయితే మావోయిస్టుల కార్యకలాపాలు సమిసిపోయాయన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మోహరించిన సీఆర్పీఎఫ్ క్యాంపులకు ఎత్తి వేసింది. ఈ నేఫథ్యంలో సరిహధ్దు ప్రాంతాల్లో తెలంగాణ గ్రే హౌండ్స్, టీజీఎస్పీ, సివిల్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. సీఆర్పీఎఫ్ క్యాంపులు తరలివెల్లిన తరువాత తెలంగాణాలో ఇదే తొలి ఎన్ కౌంటర్ కావడం గమనార్హం.

You cannot copy content of this page