దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మళ్లీ కాల్పుల మోత చోటు చేసుకుంది. మవోయాస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎధురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు నక్సల్స్ చనిపోయినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. బీజాపూర్, సుక్మా జిల్లాలో సరిహధ్దు ప్రాంతమైన బాసగూడలోని చిప్పూర్ భట్టీ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్ కౌంటర్ ఘటన జరిగింది. ఈ ఘటనలో 10వ ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ నగేష్, అతని భార్య సోనీ సహా ఆరుగురు మావోయిస్టులు మృత్యువాత పడగా, ఇందులో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలకు చెందిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఎదురు కాల్పుల్ల్లో 205, 210 బెటాలియన్స్ కు చెందిన కోబ్రా, 229 బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ బలగాలు, డీఆర్జీ ఫోర్స్ ఈ ఎధురు కాల్పుల ఘనటలో పాల్గంది. ఈ ఘటనలో బలగాలు సేఫ్ గా ఉన్నాయని బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రి, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
కవ్వింపు చర్యలా..?
హోలీ పౌర్ణమి రోజున స్థానికులు ముగ్గురిని మావోయిస్టులు హతమార్చడంతో బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టాయి. అయితే ముగ్గురిని హత్య చేసిన సమాచారం అందుకున్న తరువాత పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉందని భావించి మావోయిస్టులు అంబూష్ తీసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే సెర్చింగ్ ఆఫరేషన్ కు వెల్లిన బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్టుగా ప్రాథమికంగా సమాచారం. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న కూంబింగ్ ఆపరేషన్ కు హాజరైన బలగాలు ఎదురుదాడికి దిగినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని ముందే పసిగట్టి అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే కూంబింగ్ ఆపరేషన్ బలగాలు సేఫ్ జోన్ లో ఉండిపోయాయని సమాచారం. అయితే మావోయిస్టులు పకడ్భందీగా వేసుకున్నప్పటికీ బలగాల ఎదురుదాడితో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే సంఘటనకు చెందిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావల్సి ఉంది.