జార్ఖండ్ లో సోమవారం మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెల్తే…. ఛత్రా జిల్లా లాలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌదియా అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో 203 కోబ్రా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పుల ఘటన జరిగిందని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టల మృతదేహాలను. ఒక ఇన్సాస్, రెండు బర్మర్, 2 ఎకె 47లు కోబ్రా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో రూ 25 లక్షల రివార్డు ఉన్న ఎస్ ఏసి మెంబర్లు గౌతం పాశ్వాన్, ఛార్లే, రూ. 5లక్షల రివార్డు ఉన్న సబ్ జోనల్ కమిటీ సభ్యులు అమర్ గంజూ, సంజీవ్ భూయాన్, నందులు ఉన్నారని, ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని జార్ఖండ్ పోలీసులు తెలిపారు.