ఒంటరిని చేయనున్న నీడ…

రెండు నిమిషాలు వీడిపోనున్న షాడో…

దిశ దశ, హైదరాబాద్:

నిను వీడని నీడను నేనే అన్న పదానికి ఓ రెండు నిమిషాలు బ్రేకు ఇవ్వాల్సిందే. ఎండలో అయినా చీకట్లో అయినా నీడ పడడం సహజం. కానీ ఈ నీడే మాయం కాబోతోందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ నీడ వీడిపోయేది మాత్రం శాశ్వతం కాదండి. కేవలం రెండు నిమిషాలు మాత్రమే. ఈ భాగ్యం కూడా భాగ్యనగర వాసులకు మాత్రమే దక్కుతుందని కూడా వివరించారు. నీడ పడకుండా ఉండడమనేది అరుదైన అద్భతమనే క్షణాలనే చెప్పాలి. భూమిపై ఉండే జీవి, వస్తువు, చెట్టు, పుట్ట ఇలా ప్రతి ఒక్క దానిని వెంటాడేది నీడ మాత్రమే. కానీ ఆ నీడే ఓ రెండు నిమిషాలు అదృశ్యం కాబోతుంది. ఈ నెల 9న హైదరాబాద్ లో 12.12 గంటల నుండి 12.14 గంటల వరకు జీరో షాడో డే ఏర్పడనుందని బిర్లా సైన్స్ మ్యూజియం టెక్నికల్ ఆఫీసర్ ఎన్ హరిబాబు శర్మ మీడియాకు వెల్లడించారు. ఈ సమయంలో నిట్ట నిలువుగా ఉండే ప్రాణులు, వస్తువుల నీడ కనపడదని చెప్తున్నారు. భూమికి 90 డిగ్రీల కోణంలో ఉంచబడిన వాటి నీడ రెండు నిమిషాల పాటు కనబడదని వివరించారు.

ఎందుకిలా..?

ఏటా రెండు సార్లు జిరో షాడో డే జరుగుతుందని, సూర్యుడు ఉత్తరాయణ నుండి దక్షిణాయనంలోకి, దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారినప్పుడు జిరో షాడో డేలు ఏర్పడతాయి. భూమి భ్రమణ అక్షం సూర్యుని చుట్టూ, దాని విప్లవం యోక్క సమతలానికి 23.5 డిగ్రీల వంపు తిరుగుతుంది. ఖగోళ భూ మధ్య రేఖకు దక్షిణంగా 23.5 డిగ్రీల నుండి భూ మధ్య రేఖకు ఉత్తరం వైపునకు 23.5 డిగ్రీలకు తిరుగుతాడు. ఇదే పద్దతిన దక్షిణం వైపునకు ఓ సారి తిరుగుతాడు. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే ఆవిర్భవించే ఈ అద్భుతం సన్నివేశంపై పరిశోధకులకు శోధనలు జరిపి తేల్చిన విషయాలే ఇవి. ఏటా మే , జులై, ఆగస్టు నెలల్లో కర్కాటక, మకర రాశుల యొక్క ఉష్ణ మండలం మధ్య ఈ సన్నివేశం గమనించవచ్చని చెప్తున్నారు పరిశోధకులు. ద్వి వార్షిక దృగ్విషయంగా పిలువబడే ఈ ప్రక్రియ సూర్యుడు అత్యున్నత స్థానానానికి చేరినప్పుడు భూమిపై ఉండే ప్రాణులు, వస్తువులు, జీవకోటికి సంబంధించిన నీడ వాటి కిందపడతాయని దీంతో షాడో కనిపించకుండా పోతుందని కూడా తేల్చారు పరిశోధకులు. ఈ సారి మాత్రం ఈ జీరో షాడో డే హైదరాబాద్ వాసులను కూడా కనువిందు చేయనుందని బిర్లా సైన్స్ మ్యూజియం టెక్నికల్ అధికారి హారిబాబు శర్మ చెప్తున్నారు.

You cannot copy content of this page