Crypto currency: బౌన్సర్ల సెక్యూరిటీలో సమావేశాలు ఏర్పాటు చేసి…

మందు విందులతో మాయా ప్రపంచం చూపించి…

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల తీరు…

దిశ దశ, కరీంనగర్:

క్రిప్టో కరెన్సీలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి అత్యంత కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. బౌన్సర్ల సెక్యూరిటీ నడుమ సమావేశాలు ఏర్పాటు చేసి క్రిప్టోలో పెట్టుబడుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? మీ ద్వారా ఎంతమందిని జాయిన్ చేస్తే ఎంత మేర ఆదాయం వస్తుంది అన్న వివరాలను కులంకశంగా వివరించేవాడని తెలుస్తోంది. ఆ తరువాత మందు, విందు ఏర్పాటు చేసి భ్రమల ప్రపంచంలోకి తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టించినట్టుగా తెలుస్తోంది. తరుచూ హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కరీంనగర్ నుండి ప్రత్యేకంగా బృందాలను తీసుకెళ్లి వారిచే క్రిప్టో వ్యాపారంలో భాగస్వాములను చేసేందుకు కరీంనగర్ లో ప్రత్యేకంగా ఏజెంట్ల వ్యవస్థ కూడా తయారైనట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్, జగిత్యాల ప్రాంతాలకు చెందిన వారు ఈ ఛానెల్ నెట్ వర్క్ లో ఇన్వెస్టిమెంట్ చేసినట్టుగా సమాచారం. ఎక్కడికి వెల్లినా 10 నుండి 15 మంది బౌన్సర్లను వెంటేసుకుని తిరిగే హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఆయా ప్రాంతాలకు చెందిన వారిచే పెట్టుబడులు పెట్టించిన తరువాత లాభాల రూచి చూపించడంతో వారంతా కూడా తమ ఛానెల్ లో మెంబర్స్ ను జాయిన్ చేయడం మొదలు పెట్టారు. ఇలా భారీ నెట్ వర్క్ తయారైన తరువాత ఇన్వెస్టర్లకు రూపాయి కూడా విదిల్చకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టుగా సమాచారం. సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్య రావడంతో వేరే అకౌంట్లలో పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయ్యాయని ఈ కారణంగానే మీకు డబ్బులు చెల్లించలేకపోయాని చెప్తూ కాలయాపన చేస్తున్నట్టుగా సమాచారం.

ఎర ఎలా అంటే..?

రూ. లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు ఒక డాలర్ చొప్పున 30 రోజుల పాటు మొంబర్ కు చెందిన అకౌంట్లో యాడ్ అవుతాయని, తమ సంస్థ దృష్టిలో ఒక డాలర్ విలువ రూ, వెయ్యి అని కూడా వివరించారు. అయితే ఈ డాలర్లను రూపాయలుగా మల్చుకో్వలంటే మాత్రం కొత్తగా క్రిప్టోలో బిజినెస్ స్టార్ట్ చేసే వారికి అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చని కూడా వివరించారు. కొంతమందికి కలిపి గ్రూప్ క్రియేట్ చేసి వారి మొబైల్ లో యాప్ డౌన్ లోడ్ చేసి కొత్తగా చేరిన సభ్యుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రూప్ అడ్మిన్ గా ఉన్న వ్యక్తి ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుని కొత్తగా చేరిన వారికి విక్రయించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సంస్థ కాయిన్స్ రూపంలో సభ్యుల అకౌంట్లలో యాడ్ చేసినప్పటికీ వాటిని కరెన్సీ రూపంలో మార్చుకోవాలంటే మాత్రం కొత్తగా బిజినెస్ లో చేరిన వారికి మాత్రమే అమ్ముకోవల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ కు చెందిన ఏజంట్ రూ. 50 లక్షలు డిపాజిట్ చేసిన వారికి ష్యూరిటీగా అపార్ట్ మెంట్స్ లో కానీ ఓపెన్ ప్లాట్లు కానీ పెడతామని కూడా ప్రకటించారు. దీంతో సంస్థపై మరింత నమ్మకం పెంచుకున్న వారంతా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు సాహసించినట్టుగా తెలుస్తోంది.

పైసకు పైస లాభం…

ప్రధానంగా కరీంనగర్ కు చెందిన ఏజంట్లు పైసకు పైసా లాభం వస్తుందని చెప్తూ ఒక్కొక్కరిని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించడమే పనిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. తమకున్న వ్యక్తిగత పరిచయాలతో ఒక్కొక్కరితో పెట్టుబడులు పెట్టించడంతో ఒక్క కరీంనగర్ సిటీలోనే వందల కోట్లు దాటి ఇన్వెస్టిమెంట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకరి నుండి ఒకరు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించడంతో భారీ నెట్ వర్క్ తయారైనట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page