దిశ దశ , కరీంనగర్:
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ సమీపంలో ఓ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో వేదిక కిందకు జారడంతో ఆయన కాలికి దెబ్బ తగిలింది. కరీంనగర్ రూరల్ మండంలో చర్లబుత్కూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామంలో చిరుతల రామాయాణం నిర్వహిస్తున్నారన్న విషయం తెలిసిన మంత్రి అక్కడకు వెల్లి గ్రామస్థులను కలుసుకోవచ్చని భావించారు. చిరుతల రామాయణం జరుగుతున్న వేదికపైకి మంత్రి చేరుకోగానే ఆయన వెంట ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున డయాస్ పైకి ఎక్కారు. దీంతో ఓవర్ లోడ్ కారణంగా డయాస్ కిందకు జారింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్ కాలికి స్వల్ప గాయం కాగా వెంటనే కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. కాలికి ఫ్యాక్చర్ ఏమీ కాలేదని నిర్దారించిన వైద్యులు క్రేప్ బ్యాండేజ్ వేసి రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. కాలిపై బరువు వేయకుండా జాగ్రత్తలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే వేదిక హైట్ తక్కువగా ఉండడంతో ప్రమాదం తీవ్రత అంతాగా లేదని, ఎత్తు బాగా ఉన్నట్టయితే మంత్రితో పాటు మరికొంతమంది కూడా తీవ్ర గాయాల పాలయ్యేవారని స్థానికులు చెప్తున్నారు. ప్రజలను కలిసే ప్రయత్రం చేస్తున్న క్రమంలో మంత్రితో పాటు ఒకరిద్దరు వేదిపైకి చేరుకుంటే బావుండేది కానీ డయాస్ సామర్థ్యానికి మించి బరువు కావడంతో అది కాస్తా కుప్పకూలిపోయిందని అంటున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కాలికి గాయాలైన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావులు మంత్రి ఇంటికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post