సాయంత్రం బామ్మర్ది… రాత్రి బావ

మరదలికి వెన్నుదన్నుగా ఉండేందుకేనా..?

దిశ దశ, హైదరాబాద్:

శనివారం ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు కూడా శుక్రవారం రాత్రి ఢిల్లీకి వెల్లారు. సాయంత్రం కేటీఆర్ వెల్లగా రాత్రి హరీష్ రావు ఢిల్లీకి వెల్లడం చర్చనీయాంశంగా మారింది. కవిత విచారణ కారణంగానే బావ బామ్మర్దులిద్దరూ ఢిల్లీకి వెల్లినట్టుగా తెలుస్తోంది. శనివారం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెల్లాల్సి ఉన్నందున ఉదయం ఆమెకు భరోసా కల్పించేందుకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందున వారితో కూడా కవిత శనివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 7.30 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసి పార్టీ క్యాడర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కవిత వెంట కూడా పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ ఈడీ ఆఫీసుకు చేరుకునే విధంగా కూడా వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కవితను అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తూ విచారణలకు పిలుస్తూ ఇబ్బందులు పెడుతున్నారని సీఎం ఆరోపించారు. కవిత విచారణ నేపథ్యంలో ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన ఎత్తులు పైఎత్తులు వేసేందుకు కేటీఆర్, హరీష్ రావులను ఢిల్లీకి వెల్లాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. కవిత విషయంలో పార్టీ లైన్ కూడా చాలా సీరియస్ గా ఉన్నదన్న సంకేతాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్న లక్ష్యంతోనే ఉన్నట్టు సమాచారం.

You cannot copy content of this page