ఏపీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి కేటీఆర్

ఆంధ్రపదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు, ఎల్లుండి జరిగే ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సీఎం జగన్, మంత్రులు, కార్పొరేట్ సంస్థలు విశాఖకు చేరుకుంటున్నాయి. బుధవారం ఒక్కరోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా.. ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్మహిస్తున్న యంగర్ బ్రదర్ వైజాగ్, తోటి రాష్ట్రం ఏపీకి గుడ్ లక్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏపీకి ఆల్ ది బెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే గొప్ప రాష్ట్రాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. మరోవైపు ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఏపీకి బిగ్ బ్రదర్‌గా సంబోధించారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. హైదరాబాద్‌లో ఏపీని ప్రమోట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. బిగ్ బ్రదర్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు.

మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. హైదరాబాద్‌ను అమర్‌నాథ్ బిగ్ బ్రదర్ అని సంబోధిస్తే.. వైజాగ్‌ను కేటీఆర్ యంగర్ బ్రదర్ అని వ్యాఖ్యానించారు. ఏపీ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page