సీటు పోతే పోనివ్వండి ఏం ఫర్లేదు…

కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ దశ, హైదరాబాద్:

మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చిన తరువాత ఏఏ నియోజకవర్గాల్లో నాయకత్వం స్త్రీల చేతుల్లోకి వెల్తుందో తెలియదు కానీ. ఈ అంశంపై మాత్రం తర్జనభర్జనలు పెద్ద ఎత్తున సాగుతూనే ఉన్నాయి. బిల్లును అమల్లోకి వచ్చినట్టయితే మహిళలు ఎక్కువగా ఉన్న నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయ నియోజకవర్గాల వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ నియోజకవర్గాల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతోందో లేదో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సి ఉన్నప్పటికీ ముఖ్య నాయకులకు మాత్రం ఈ అంశంపై పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ మహిళా రిజర్వేషన్ లో నా సీటు పోతుందంటే ఏం ఫర్లేదు పోనివ్వండి… మనందరివి చాలా చిన్న జీవితాలు… అందులో నా పాత్ర నేను పోషించాలనుకుంటున్నాను అని కేటీఆర్ కామెంట్ చేశారు.

You cannot copy content of this page