దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికల అంశం తెరపైకి రావడంతో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న తర్జనభర్జనలు సాగుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. అక్టోబర్ 10లోగా నోటిఫికేషన్ వస్తేనే సమయంలోగా ఎన్నికలు జరుగుతాయని, అయితే అప్పటి లోగా నోటిఫికేషన్ విడుదల కావడం అనుమానంగానే ఉందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో కూడా ఎన్నికలు కూడా ఏప్రిల్, మేనెలలో జరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.
అసత్యాలు ప్రచారం చేయకండి: కేటీఆర్
తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు చేసిన కామెంట్స్ గా కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయని అదంతా అసత్యమని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదని దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post