టార్గెట్ 18

అర్థరాత్రి మంత్రి విజిట్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ సెక్రటరియేట్ బిల్డింగ్ ను జనవరి 18న ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూ సచివాలయ భవన నిర్మాణ తీరు తెన్నులపై క్షేత్ర స్థాయి పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. మరో 20 రోజుల్లో ప్రారంభించాలన్న నిర్ణయించడంతో భవనాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్థరాత్రి సమయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెక్రటెరియేట్ ను సందర్శించి పనుల తీరు తెన్నులను పర్యవేక్షించారు. సీఎంఓతో పాటు వివిధ శాఖలకు సంబందించిన ఛాంబర్లు, ఆయా విభాగాల అధికార యంత్రాంగం పనిచేసేందుకు అనువుగా ఉండే విధంగా నిర్మిస్తున్న ఈ భవనాన్ని జనవరి 18న ప్రారంభించేందుకు సిద్దం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

You cannot copy content of this page