దిశ దశ, హైదరాబాద్:
వైద్యో నారాయణో హారి అన్న పదానికే వక్రబాష్యం చెప్పేస్తున్నారా..? ఓ వైపున రోగం వచ్చిందంటే చాలు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్న డాక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుంటే… మరోవైపున అనారోగ్యం పాలైన పేదలను ఆదుకునేందుకు అందించే ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా వదలడం లేదా..? వైద్య వృత్తికే సవాల్ విసురుతున్న తాజా ఘటనపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆరు కేసులు నమోదు.. .
నిరుపేదలు అనారోగ్యం బారిన పడినట్టయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ స్కీం బిల్లుల కోసం ఆసుపత్రుల నిర్వహాకులు చేయని వైద్యానికి కూడా బిల్లులు పెట్టేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు. తాజాగా సీఐడీ రాష్ట్రంలోని 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకుల తీరుపై చర్చ మొదలైంది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీనంగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రైవేటు ఆసుపత్రులు తప్పుడు బిల్లులు పెట్టడం సంచలనంగా మారింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసేందుకు కొన్ని ఆసుప్రతుల యాజమాన్యలు ఎంచుకున్న తీరు వెలుగులోకి రావడం అన్ని వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. CMRF నిధుల దుర్వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారుల బృందాలు వివిధ కోణాల్లో విచారణ జరిపి కేసులు నమోదు చేశారు. ఇప్పటికే CMO లోని CMRF విభాగం రికార్డులను, ఆయా ఆసుపత్రుల్లోని రికార్డులను పరిశీలించిన సీఐబీ బాధ్యులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా నిర్దారణ జరిగిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన మరిన్ని ఆదారలను కూడా సేకరించే పనిలో సీఐడి అధికారులు నిమగ్నమైనట్టుగా సమాచారం.
ఆసుపత్రుల వివరాలివే..
Hyderabad:
Aruna Sree Multi Specialty Hospital, IS Sadan X Road, Sri Krishna Hospital, Saidabad, Janani Hospital, Saidabad Hiranyaa Hospital, Meerpet, Delta Hospital, Hasthinapuram, Sree Raksha Hospital, BN Reddy Nagar, MMS Hospital, Sagar Ring Road, ADRM Multi Specialty Hospital, Sharadanagar, MMV Indira Multi Specialty Hospital, Kothapet, Sri Sai Thirumala Hospital, Bairamalguda
Khammam:
Sri Srikara Multispeciality Hospital, Global Multispecialty Hospital, Dr. J.R. Prasad Hospital, Sri Vinayaka Super Speciality Hospital, Sri Sai Multi Specialty Hospital, Vyshnavi Hospital, Sujatha Hospital, New Amrutha Hospital, Orange Hospital, Megasri Hospital, Bonakal.
Nalgonda:
Naveena Multi Specialty Hospital, Miryalaguda, Mahesh Multi Specialty Hospital, Miryalaguda, Amma Hospital, Railway Station Road
Karimnagar:
Sapthagiri Hospital, Jammikunta, Sri Sai Hospital, Peddapalli
Warangal:
Rohini Medicare Pvt. Ltd., Hanumakonda, Mahabubabad
Sri Sanjeevini Hospital, Siddhartha Hospital