దిశ దశ, కాళేశ్వరం:
గ్రామ అవసరాల కోసం సమీకరించిన నిధులను సొంత అవసరాలకు వాడుకున్నారు. ఆరేళ్లుగా డబ్బును తమ వద్దే అట్టి పెట్టుకున్న ప్రబుద్దుల భరతం పట్టారు పోలీసులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పూస్కుపల్లి గ్రామ అభివృద్ది కోసం రూ. 4 లక్షల వరకు నిధులు సమీకరించారు. ఈ డబ్బుతో గ్రామంలో ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు గ్రామస్థులు. 2019లో డబ్బులు వసూలు చేసినప్పటికీ గ్రామ అవసరాల కోసం నిధులు ఖర్చు చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు పూస్కుపల్లి వాసులు. గత సంవత్సరం నమోదయిన ఈ కేసును దర్యాప్తు చేసిన ఎస్ఐ తమాషా రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన ఆరుట్ల పవన్ కుమార్, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత భర్త మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశామని ఎస్ఐ వివరించారు. నిందితులను కోర్టులో పరిచిన పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మోహన్ రెడ్డి అరెస్ట్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.